బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్
Telangana

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

5 నెలల్లో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్

జిల్లా ప్రతినిధి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు రక్షణ కవచంలా షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో షీ టీమ్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, మరో 16 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.

మహిళలు, బాలికలు, విద్యార్థినులు వేధింపులకు గురైనప్పుడు వెంటనే సమాచారం అందిస్తే జిల్లా షీ టీమ్ తక్షణమే స్పందించి అవసరమైన రక్షణ చర్యలు చేపడుతుందని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ

జిల్లాలోని విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్ బృందాలు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, మహిళల హక్కులు మరియు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో గుర్తించిన హాట్‌స్పాట్ల వద్ద షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిత్యం నిఘా ఉంచి మహిళలు, విద్యార్థినులను వేధించే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, రహదారులు లేదా ఉద్యోగ ప్రదేశాల్లో ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించినా, వెంబడించినా వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.