బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

నారాయణగూడ పోలీసుల చేతిలో ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులు అరెస్ట్

నారాయణగూడ పోలీసుల చేతిలో ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులు అరెస్ట్

హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమాయకులను మోసం చేసి నగదు దోచుకుంటున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు మహమ్మద్ సల్మాన్ (26), అజాన్ తౌఖీల్ ఖాన్ (19)గా గుర్తించారు. వీరిద్దరూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మోసం చేసే విధానం ఇలా…
ఏటీఎం సెంటర్లకు నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి, “గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తాం” అని నమ్మబలుకుతారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న తర్వాత, అసలు ట్రాన్సాక్షన్ చేయకుండా “పేమెంట్ సక్సెస్” స్క్రీన్ చూపించి అక్కడి నుంచి పరారవుతారు.

ఈ నిందితులు నారాయణగూడ, మాసాబ్ ట్యాంక్, సుల్తాన్‌బజార్, ఐఎస్ సదన్, డోమల్గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు కేసుల్లో పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

కేసు వివరాలు…
ఏప్రిల్ 13న ఆదిత్య అగర్వాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అతను రూ.20,000 నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లగా నిందితులు ఇదే పద్ధతిలో మోసం చేసినట్లు పేర్కొన్నారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆధునిక సాంకేతికత సహాయంతో ఏప్రిల్ 16న మలక్‌పేట్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు. విచారణలో వీరు చేసిన నేరాలను అంగీకరించినట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో నారాయణగూడ ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్, డీఐ అభిలాష్, డీఎస్‌ఐ నాగరాజు తదితరులు కీలక పాత్ర పోషించారు. పోలీసుల పనితీరును ఖైరతాబాద్ డీసీపీ అభినందించి, బృందాన్ని పురస్కరించారు.