బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

మామూళ్ల వసూళ్లపై చార్మినార్ పోలీసుల హెచ్చరిక

మామూళ్ల వసూళ్లపై చార్మినార్ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్: చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు మరియు వీధి వ్యాపారుల నుండి అక్రమంగా మామూళ్లు వసూలు చేస్తున్న వ్యక్తులకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే నాయకత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ మరియు చార్మినార్ ఎస్‌హెచ్‌ఓ రాంబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అక్రమ వసూళ్లు లేదా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రౌడీ షీట్లు తెరవడమే కాకుండా, కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని, ఇది తుది హెచ్చరిక అని తెలిపారు. నేర ప్రవృత్తిని వీడి గౌరవప్రదమైన జీవనోపాధిని ఎంచుకోవడానికి ఇదొక చివరి అవకాశమని సూచించారు.

అదేవిధంగా దుకాణదారులు మరియు వ్యాపారులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, రోడ్ల ఆక్రమణలు చేయకుండా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన చార్మినార్ ప్రతిష్టను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

అక్రమ వసూళ్ల పట్ల చార్మినార్ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.