Breaking News

ప్రజలను మోసం చేసిన VIPS group of companies అధినేత వినోద్ తుకారాం ఖుటే&ఏజెంట్లు అరెస్టు.

ఆధిక లాభాలు & కాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మిoచి మోసం చేసిన కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి, పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన VIPS group of companies అధినేత వినోద్ తుకారాం ఖుటే & ఏజెంట్లు. మరోసారి “WAVE” పేరుతో మోసం చేయాలన్న యత్నంను భగ్నం చేసి అరెస్ట్ చేసిన నల్లగొండ రూరల్ పోలీస్, VIPS కంపెనీ ఏజెంట్లను అరెస్టు చేసిన నల్గొండ రూరల్ పోలీసులు. 2016 సంవత్సరంలో పుణె నగరo, మహారాష్ట్ర రాష్ట్రం కు చెందిన “వినోద్ తుకారాం ఖుటే” అనే వ్యక్తి VIPS Virtual Intelligence Payment System (VIPS) అనే వాలెట్ యాప్ ను ప్రారంభించాడు. 2018లో ఈ సంస్థను VIPS Group of Companies గా మార్చి, వివిధ రకాల సేవల పేర్లతో ఆధిక లాభాలు & కాష్ బ్యాక్ ఆఫర్ అంటూ ఆన్లైన్ లో విస్తృతముగా ప్రచారం చేసి, తన ఏజెంట్ల, ఎగ్జిక్యూటివ్, సీనియర్-ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డవెలప్మెంట్ డైరెక్టర్ లు ద్వారా కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి, వారికి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను నమ్మిoచి మోసం చేసినారు. 1)Prime membership పేరుతో సభ్యత్వ రుసుము ₹1,995/- వసూలు చేసి, వారికి ₹2,000 షాపింగ్ పాయింట్లు, మరియు మొత్తం నగదు తిరిగి వచ్చే వరకు రోజుకు ₹7 రాబడి ఇస్తామని హామీలతో డబ్బులు వసూల్ చేసినారు, కానీ ఇవ్వలేదు. 2)Referral Commission (కమిషన్ వ్యవస్థ) పేరుతో, మీరు మీక్రింద (3) జాయిన్ చేయండి, వారి క్రింద వారు (3) జాయిన్ చేయాలి, అలా చైన్ సిస్టమ్ (5) స్థాయిల వరకు మల్టీ-లెవల్ కమిషన్ వస్తుంది (1లెవల్-20%, 2లెవల్ – 5%, 3లెవల్ – 2.5%, 4లెవల్ – 1.25%, 5లెవల్ – 1.25% ) కమిషన్ డబ్బులు వస్తాయి అని డబ్బులు వసూల్ చేసినారు, కానీ ఇవ్వలేదు. 3)VIPS ట్రేడింగ్ పేరుతో ₹10,000/- లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయమని ప్రేరేపించి, నెలకు 3% -5 % రాబడి ఇస్తామని హామీ ఇచ్చి, అధిక మొత్తంలో డిపాజిట్ చేయించుకొనినారు, కానీ ఇవ్వలేదు. 4)VIPS ప్రాపర్టీస్ పేరుతో, తమ కంపెనీ చెప్పిన స్థలాలను కొంటె, 100 నెలలలో “100% క్యాష్‌బ్యాక్” ఇస్తామని భరోసా ఇచ్చి స్థలాలను కొనిపించి, వారికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. 5)MARCHANT మెర్చంట్ & QR వ్యవస్థ పేరుతో దుకాణాలను QR కోడ్‌తో నమోదు చేసి, క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ, దుకాణ యజమాని మరియు కస్టమర్ మధ్య పంచుకునే విధానం డబ్బులు వసూల్ చేసినారు, కానీ ఇవ్వలేదు. ఇలా VIPS group of companies అధినేత వినోద్ తుకారాం ఖుటే & అతని ఏజెంట్లు అందరూ కలిసి కుట్ర పన్ని వివిధ పథకాల పేరుతో డబ్బు సర్క్యులేషన్/పిరమిడ్ స్కీమ్‌ గా సృస్టించి, కొత్త సభ్యుల చేర్పుపై లాభాలు ఉంటాయి అని మాయమాటలు చెప్పి, కానీ నిజమైన వ్యాపార కార్యకాలాపాలు లేవు, అసాధ్యమైన (అసంభవమైన) అధిక రాబడులు హామీల పేరుతో ప్రజలను నమ్మిoచి మోసం చేసినారు. తేదీ 11-04-2026 మద్యహనం 02:00 గంటలకు నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో కలిసి “WAVE” అనే కొత్త కంపెనీలో పాత కస్టమర్లు మళ్లీ ₹1,00,000/- పెట్టుబడి పెడితే, పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసం చేయాలని యత్నించారు. ఈ సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 1) కానాల లక్ష్మినారాయణ రావు – వనస్థలిపురం, హైదరాబాద్, 2) పున్నం బాలకృష్ణ – మర్రూర్ గ్రామం, నకిరేకల్ మండలం, 3) ఉయ్యాల శ్రీనివాస్ – ఏలికట్టే గ్రామం, చిట్యాల మండలం, 4) కురాకుల రమేష్ – నల్గొండ పట్టణం, 5) గాజుల మహేష్ – దోరేపల్లి గ్రామం, కనగల్ మండలం, 6)కోల కుశలయ్య – కాకుల కొండారం గ్రామం, నల్గొండ మండలం, 7) మాదగొని సైదులు – శ్రీరామ్ నగర్ కాలనీ, నల్గొండ పట్టణం, 8)ముడుసు ఉమా శంకర్ – మునుకుంట్ల గ్రామం, కట్టంగూర్ మండలం, 9)ఓరుగంటి శంకర్ – అప్పాజీపేట గ్రామం, నల్గొండ మండలం, 10)గుడపూరి లింగస్వామి @ గూడూరు అఖిల్ – కట్టంగూర్ మండలం. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు: 1) వినోద్ తుకారాం ఖుటే – CEO, VIPS Group of Companies, 2) సుమిత్ పురాంక్ – డైరెక్టర్, 3) కల్యాణ్ చక్రవర్తి – సౌత్ ఇండియా డెవలప్మెంట్ డైరెక్టర్, 4) గుమ్మల సత్యనారాయణ – డైరెక్టర్, 5) గుమ్ముల అభినాష్– డైరెక్టర్. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ పెట్టుకోవద్దు –ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా “తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు”, “పెట్టిన డబ్బు రెట్టింపు”, “రోజుకు భారీ ఆదాయం” వంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత, ఉద్యోగార్థులు మరియు మద్య తరగతి ప్రజలు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశపడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు వివిధ పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఈ మోసగాళ్లు మొదట చిన్న మొత్తంలో లాభాలు చూపించి నమ్మకం కలిగించి, తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తారు. డబ్బు పంపించిన తర్వాత వారు సంప్రదింపులు నిలిపివేయడం లేదా ఖాతాలను మూసివేయడం జరుగుతోంది. కాబట్టి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరైనా ఇలాంటి మోసలకు పాల్పడితే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌ను తెలియజేయాలని అడిషనల్ ఎస్పి అన్నారు. ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఇట్టి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ II టౌన్ సి‌ఐ వి. రాఘవ రావు, నల్గొండ రూరల్ ఎస్‌ఐ సైదా బాబు మరియు వారి సిబ్బందిని నల్గొండ ఎస్‌పి అభినందించారు.

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *