Breaking News

నకిలీ కరెన్సీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న విదేశీ నిందితుడు అరెస్ట్ – జిల్లా ఎస్పి.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలో నకిలీ ₹500 రూపాయల నోట్ల ఆకారంలో ఉన్న కాగితాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. A-1: Salman @ Uma Daliya – (పరారీలో ఉన్నాడు). A-2: Goita Soungalo, వయస్సు 53 సంవత్సరాలు, వృత్తి రైతు, నివాసం Paramount Colony, Towlichowki, Hyderabad. స్వస్థలం: Gougou, Mali, West Africa. (వీసా గడువు: 03-ఆగస్టు-2024 వరకు). తిప్పర్తి పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, నిందితుడు సుమారు రెండు సంవత్సరాల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశం నుండి భారతదేశానికి వచ్చి, కొంతకాలం బెంగళూరులో నివసిస్తూ ఆఫ్రికన్ పండ్లు మరియు ఇతర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం కొంతమంది విదేశీయులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయాలు పెంచుకుని, వీరు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడే కుట్ర పన్నారు. నిందితులు వారి పథకంలో బాగంగా ముందుగా అమాయక వ్యక్తులను వాట్సాప్ ద్వారా సంప్రదించి, ఒక లక్ష రూపాయల అసలు కరెన్సీకి బదులుగా ఐదు లక్షల రూపాయల విలువ గల ₹500 నోట్లను ఇస్తామని నమ్మబలుకుతారు. బాధితుడు నమ్మకపోతే, నల్లటి రంగు పూసిన 500 రూపాయల నోట్ ప్రత్యేక రసాయనంతో కడిగి నిజమైన నోటుగా మారినట్లు ప్రదర్శన చూపించి మోసం చేస్తారు. తేదీ 06-04-2026 న తిప్పర్తి మండలం మల్లేపల్లి వారిగూడెం దాబా వద్ద వంగూరి జానయ్య అనే వ్యక్తిని నిందితుడు మోసం చేసి ₹1 లక్ష అసలు కరెన్సీ తీసుకుని, ₹5 లక్షల విలువ గల నోట్ల కట్టగా నమ్మబలికి, పైభాగంలో నాలుగు ఒరిజినల్ ₹500 నోట్లు చూపించి మిగతా భాగంలో నల్లటి కాగితాలను ఇచ్చాడు. బాధితుడు ఇంటికి వెళ్లి ఆ కట్టను నిందితుడు ఇచ్చిన రసాయనంతో కడిగి చూడగా దానిలో ఎటువంటి మార్పు లేకపోవడం తో తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. తరువాత తన స్నేహితుడు నకరెకంటి అంబేద్కర్ @ అభిరామ్ సహాయంతో నిందితుడిని మళ్లీ సంప్రదించి, ₹2 లక్షలు ఇస్తామని చెప్పి ₹10 లక్షల విలువ గల నోట్లు కావాలని అడిగారు. ఈ క్రమంలో తేదీ 09-04-2026 న మధ్యాహ్నం 12:30 గంటలకు తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన నిందితుడు Goita Soungalo ను బాధితుడు మరియు అతని స్నేహితుడు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 1).నాలుగు కట్టల బ్లాక్ కలర్ ₹500 నోట్ల సైజు కాగితాలు. 2).ఒక రసాయన ద్రావణం,పౌడర్. 3).ఒక Redmi కంపెనీ మొబైల్ ఫోన్. 4).నాలుగు ఒరిజినల్ ₹500 రూపాయల నోట్లు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈ తరహా నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు సూచించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించినందుకు గాను నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సి.ఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్.ఐ వి. శంకర్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పి అభినందించారు.

(CEIR) టెక్నాలజీ ద్వారా పోయిన 23 మొబైల్ ఫోన్ల రికవరీ మరియు బాధితులకు అందజేత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *