బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

నల్లగొండ జిల్లాలో ఆపరేషన్ స్మైల్-XI ద్వారా 99 మంది బాలకార్మికులకు విముక్తి – జిల్లా ఎస్పీ.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XI విడతలో జిల్లా వ్యాప్తంగా 99 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో 03 సబ్ డివిజన్ లలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇందులో భాగంగా జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్- 11 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో 99 మంది బాలకార్మికులను గుర్తించి కాపాడడం జరిగిందనీ తెలిపారు. ఇందులో 88 మంది మగ పిల్లలు మరియు 11 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. వీరినoదరినీ వారి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 61 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని,బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ -XI లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఈ సందర్బంగా ఎస్పీ అభినందించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్