Breaking News

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ips.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఈసంవత్సరం జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ ,వివిధ శాఖల అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 97 మంది బాలబాలికలను గుర్తించి CWC ముందు హాజరుపర్చగా వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అప్పగించడం జరిగిందని,18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను చూసినప్పుడు స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను,సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ముద్రా రుణ మోసంలో పాల్గొన్న నిందితుడు అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *