Breaking News

జిల్లాలో రికార్డ్ స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించిన-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించిన నల్లగొండ పోలీసు శాఖ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,ఒక్క జూలై నెలలో 90 కేసులలో 106 మంది బాల కార్మికుల రెస్క్యూకౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింత.
పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను వెట్టిచాకిరీతోనే బంధీ అయిపోతున్న పసిబాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేసింది నల్లగొండ జిల్లా పోలీసు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో బాలకార్మికులు, వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని,ఇండస్ట్రియల్ కంపెనీల్లో పని చేసే వారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో ఎస్పీ నేతృత్వంలో పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారుల సమన్వయంతో టీమ్ లుగా ఏర్పడి ఒక్క జూలై నెలలోనే 90 కేసుల్లో 106 మంది పిల్లలను రెస్యూ చేయడం వీరిలో 94 మంది బాలలు 12 మంది బాలికలు వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలు బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, యూపీ మరియు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం. జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్- 100 లేదా 1098 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

ముద్రా రుణ మోసంలో పాల్గొన్న నిందితుడు అరెస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *