Breaking News

ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు వారందించిన సేవలు మారువలేనివి.
• పదవి విరమణ పొందుతున్న అధికారులు ఎ.సంజీవ రావ్ అదనపు ఎస్పీ (అడ్మిన్), యాదవ రెడ్డి, ఎస్ఐ, అలీముద్దీన్ ఆర్.ఎస్ఐ మరియు అజీముద్దీన్ ఎ.ఎస్ఐ లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.,పదవి విరమణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ పదవి విరమణ పొందుతున్న అధికారులను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) సంజీవ రావ్, సౌమ్యశీలి, అడ్మినిస్ట్రేషన్ లో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తూ.వివిధ రకాల కార్యక్రమాలలో సహాయకారిగా ఉంటూ.సలహాలు అంధించేవారు. ఆయన రెటైర్మెంట్ తీరని లోటు అన్నారు. సంజీవ రావ్ (1995) లో రాష్ట్ర పోలీసు శాఖలో సబ్-ఇన్స్పెక్టర్ గా నియామకమై, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సహితం, ధైర్య సహాసాలతో విధులు నిర్వహించి, లా అండ్ ఆర్డర్ మెంటైన్ చేయడంలో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సమర్ధవంతంగా పని చేయడం జరిగిందని అన్నారు. ఇంటెలిజన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సేకరించి అధికారుల మన్ననలు పొందారని అన్నారు. వీరు అధించిన ఉత్తమ సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం జరిగిందని అన్నారు. యాదవ రెడ్డి ఎస్ఐ -(1983), అలీముద్దీన్ ఆర్ ఎస్ఐ (1983), అజీముద్దీన్ ఎ.ఎస్ఐ (1983) పోలీస్ కానిస్టేబుల్స్ గా జిల్లా పోలీసు శాఖలో నియామకమై గడిచిన 42 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో క్రైమ్ డ్యూటి, ఫింగర్ ప్రింట్ విభాగంలో, విఐపి పర్సనల్ సెక్యూరిటి అధికారిగా విధులు నిర్వహిస్తూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సైతం సమర్ధవంతంగా విధులను నిర్వహించడం జరిగిందని, తనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతులు పొందుతూ.సబ్-ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతులు పొందడం వారి అందించిన సేవలకు నిదర్శనం అని అన్నారు. పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని వారి సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి వారికి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామని, రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. పోలీస్ శాఖ తరపున వారికి, వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్టికల్ డిఎస్పీ శ్రీనివాస రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఎఆర్ డియస్పీ నరేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ అశోక్, మోహనప్ప, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఐ లు రామారావ్, రాజశేఖర్, డానియెల్ మరియు రిటైర్డ్ అవుతున్న అధికారుల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *