
నార్కట్పల్లి మండల పరిధికి చెందిన వలిగొండ వెంకన్న తండ్రి నర్సింహ, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి మోసం చేసిన కేసులో నిందితుడుకి ADJ-II కమ్ SC/ST కోర్టు,అత్యాచారం మరియు POCSO కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు U/s 420,376 of IPC and Sec 5(1) &6 of POCSO Act- 2012 under sec.235(2) Cr.P.C ప్రకారం నిందితునికి 21 సంవత్సరాల జైలు మరియు జరిమాన విధించడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,ఒక ప్రకటనలో తెలిపారు. 2018 వ సంవత్సరంలో నిందితుడు నార్కట్పల్లి మండలానికి చెందిన వాడపల్లి వెంకన్న,కట్టంగూర్ మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని గర్భవతి చేసిన తర్వాత పెళ్ళి చేసుకొననీ మోసం చేయడంతో బాధితురాలు పిర్యాదు మేరకు కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో తేది 20-04-2018 లో నిందితుని పై Cr.No.64/2018 U/s, 376,420,IPC, sec12 of pocso act 2012 క్రింద కేసు నమోదు చేసి కోర్ట్ లో ఛార్జ్ సీట్ దాఖలు సమర్పించగా వాదోపవాదల అనంతరం నేడు నిందితునికి మొత్తం 21 సంవత్సరాలు జైలు మరియు 30000/- జరిమాన మరియు బాధితురాలికి 10,00,000/-(పది లక్షల రూపాయలు)* పోక్సో చట్టం-2012 సెక్షన్ 3 ద్వారా పరిహారం త్వరితగతిన చెల్లింపును చేయాలని DLSA ఆదేశించింది. ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్,యస్.ఐ బి.రంజిత్, సీఐ క్యాస్ట్రో, ప్రస్తుతం శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి,యస్. ఐ రవీందర్ కట్టింగూర్ పీఎస్,PPవేముల రంజిత్ కుమార్,CDO రువ్వా నాగరాజు, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు, P.నరేందర్, N.మల్లికార్జున్, జిల్లా ఎస్పీ అభినందించారు.