Breaking News

జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా యస్.పి ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *