
సిరిసిల్ల పట్టణ పరిధిలోని అపెరల్ పార్క్ లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రుల రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్ తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.అపెరల్ పార్క్ లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్తమనికి మంత్రుల రాక సందర్భంగా సుమారు 300 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. యూనిట్ ప్రారంభోత్సవ ప్రాంగణంలో,విఐపి గ్యాలరిలో,సభ ప్రాంగణంలో,వివిఐపి, జనరల్ పార్కింగ్ ప్రదేశలలో బందోబస్తులో ఉన్న అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ నశేషాద్రిని రెడ్డి,సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సదన్ కుమార్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్.ఐలు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు పాల్గొన్నారు.
