బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం – ఒకరు అరెస్ట్.

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పహాడీషరీఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 8 క్వింటాళ్ల (800 కిలోలు) బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున పహాడీషరీఫ్ పోలీసులు జమా మసీద్ సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటోను (నెం. TS13UB6510) నిలిపి తనిఖీ చేయగా, అందులో 16 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తాలో 50 కిలోల చొప్పున మొత్తం 800 కిలోల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహన డ్రైవర్‌ రామ్ జీవన్ సాహ్ని (52) ని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాజిద్ అలియాస్ ఫయాజ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు. నిందితులు రేషన్ కార్డు దారుల నుండి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి, వాటిని పక్కదారి పట్టించి ఎక్కువ ధరకు విక్రయించి అక్రమ లాభాలు గడిస్తున్నట్లు విచారణలో తేలింది. బియ్యాన్ని మరియు వాహనాన్ని పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారంలో సంబంధం ఉన్న మరో నిందితుడు ఫయాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అవసరమైన నిత్యావసర వస్తువులను అక్రమంగా మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి అక్రమ రవాణాను అరికట్టడానికి పహాడీషరీఫ్ పోలీసులు నిరంతరం కృషి చేస్తారని ఇన్‌స్పెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్