బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

మైలార్‌దేవ్‌పల్లిలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.

రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఒక దొంగను చాకచక్యంగా పట్టుకుని, అతని వద్ద నుండి లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్ వెల్లడించారు. ఈ నెల 05-04-2026న మైలార్‌దేవ్‌పల్లి నివాసి సిరంగి బుచ్చయ్య (49) పోలీసులకు ఫిర్యాదు చేశారు. 05-04-2026 అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు మరియు నగదును దొంగిలించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 322/2026, సెక్షన్లు 331(4), 305 BNS కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు (10-04-2026) పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎ-1) షేక్ షబ్బీర్ (24), తండ్రి: షేక్ మస్తాన్ వలి. వృత్తి: కార్ మెకానిక్. స్వస్థలం: గుంటూరు జిల్లా, చుట్టుగుంట కాలనీ, ఆంధ్రప్రదేశ్. ఇతడు స్థిరనివాసం లేకుండా ఫుట్‌పాత్‌లు మరియు లాడ్జీలలో ఉంటూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు (విలువ సుమారు రూ. 5,20,000/-).

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్
  1. ఒక బంగారు ఉంగరం (3.7 గ్రాములు)
  2. మరొక బంగారు ఉంగరం (9.8 గ్రాములు)
  3. బంగారు వంకీ (4.8 గ్రాములు)
  4. బంగారు పుస్తెల తాడు (18 గ్రాములు)
  5. ఒప్పో (OPPO) మరియు ఐఫోన్ (iPhone) మొబైల్ ఫోన్లు.
    నిందితుడు రాత్రి సమయాల్లో కాలనీలలో తిరుగుతూ, తలుపులు తెరిచి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటాడు. లోపలికి ప్రవేశించి దొరికిన కాడికి బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు అపహరిస్తాడు. దొంగిలించిన సొత్తును తక్కువ ధరకే విక్రయించి, ఆ డబ్బుతో జల్సాలు చేయడం ఇతని అలవాటు. ఇతనిపై గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నగరంపాలెం (FIR No: 511/2019) మరియు లాలాపేట (FIR No: 503/2022, 508/2022, 519/2022) పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ. సుధాకర్ పర్యవేక్షణలో, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, డి.ఐ. మక్సూద్ అలీ, డి.ఎస్‌.ఐ. ఎస్.వి. రమణ మరియు క్రైమ్ సిబ్బంది సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని నేడు న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నారు.