బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

ఏఎస్ఐ నుండి ఎస్సైగా పదోన్నతి – జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చిహ్నం బహుకరణ.

మహబూబ్‌నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజుద్దీన్ ఏఎస్ఐ (ASI) నుండి ఎస్సై (SI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ఆయనకు పదోన్నతి చిహ్నాన్ని తన చేతుల మీదుగా బహుకరించారు.
మొహమ్మద్ మొయిజుద్దీన్ 1989 సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో పోలీస్ కానిస్టేబుల్‌గా సేవలో ప్రవేశించి, అలంపూర్, తిమ్మాజిపేట్, జడ్చర్ల, పెద్దకొతపల్లి, కోస్గి పోలీస్ స్టేషన్లలో కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. అనంతరం 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2018లో ఏఎస్ఐగా పదోన్నతులు పొందారు. DCRB, CCS మహబూబ్‌నగర్, హన్వాడ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సేవలందించి, ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
తన విశిష్ట సేవలకు గాను ఇప్పటివరకు 70 కాష్ రివార్డులు, 18 GSEలు, 12 ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అదేవిధంగా 2013లో సేవా పతకం, 2017లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం, 2019లో ఉత్తమ పోలీస్ పతకం, 2025లో IPM మెడల్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, “ మొయిజుద్దీన్ క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం. ఈ పదోన్నతి ఆయన దీర్ఘకాల సేవలకు లభించిన గౌరవం” అని అభినందించారు. అలాగే పదోన్నతి తోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్