బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు నగల చోరీ

వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు నగల చోరీ

పనిమనిషి అరెస్ట్ – 95.4 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: వృద్ధ దంపతుల ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తూ వారి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన మహిళను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి సుమారు రూ.3,88,000 విలువైన 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.8,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఫిర్యాదుదారుడి వివరాలు

హబ్సిగూడ, గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పి.ఎల్.కె.ఎమ్. రావు (79) వృద్ధాప్య కారణంగా సహాయకురాలిని నియమించుకున్నారు. ఈ అవకాశాన్ని నిందితురాలు వినియోగించుకుంది.

నిందితురాలి వివరాలు

నిందితురాలిని అల్లం తేజస్వి (43)గా గుర్తించారు. ఆమె భర్త సుదర్శన్. ప్రస్తుతం మాల్రెడ్డి నగర్, ఆల్మాస్ గూడ, బడంగ్‌పేట నివాసిగా ఉంటోంది. స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, కొండనాగుల.

నేర నేపథ్యం

గతంలో కిరాణా షాపు నిర్వహించి నష్టపోయిన నిందితురాలు అప్పుల బారిన పడి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చోరీ మార్గాన్ని ఎంచుకుంది. జూన్ 2025లో సునీత అనే మహిళ ద్వారా హబ్సిగూడలోని డాక్టర్ రావు ఇంట్లో నెలకు రూ.18,000 జీతానికి కేర్‌టేకర్‌గా చేరింది. అక్టోబర్ 2025 నుంచి ఫిబ్రవరి 23, 2026 మధ్య కాలంలో ఇల్లు శుభ్రం చేసే నెపంతో అలమరలోని బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు, చంద్రహారాన్ని విడతల వారీగా దొంగిలించింది.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

ఫిబ్రవరి 25 ఉదయం 7.30 గంటలకు హబ్సిగూడ బస్ స్టాప్ వద్ద నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

  • 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ సుమారు రూ.3,80,000)
  • రూ.8,000 నగదు

మొత్తం రికవరీ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు రక్షిత కె మూర్తి (డీసీపీ, సికింద్రాబాద్ జోన్) మరియు జి. జగన్ (ఏసీపీ, ఓయూ డివిజన్) మార్గదర్శకత్వంలో జరిగింది. ఓయూ ఇన్‌స్పెక్టర్ ఎం. మహేష్ పర్యవేక్షణలో ఎస్‌ఐ పి. కరుణాకర్, క్రైమ్ టీం సిబ్బంది ఈ కేసును వేగంగా ఛేదించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.