
జిల్లా పోలీసు శాఖలో దాదాపు 38 సంవత్సరాల పాటు పని చేస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ లు దేవసాయం,ప్రభాకర్ రెడ్డి లను జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయం అని అన్నారు. మీ యొక్క సేవలు, అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం అని, పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు. పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీసు కుటుంబ సభ్యులేనని, ఏలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. అనంతరం వారికీ అందవలసిన ఆర్దిక సదుపాయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.