బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి.
శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ పని చేయాలి.
దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్ , పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు,ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పని చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియస్ రైస్ అక్రమ రవాణా,జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని , పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వచ్చిన పిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్.ఐ ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్,ఎస్.ఐ కృష్ణా రెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్