• బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
• వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన చార్మినార్ జోన్-VI డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్.
• ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుపై జిల్లా ఎస్పీ ని ప్రశంసించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా చార్మినార్ జోన్-VI డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అలజడి లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను డీఐజీ పరిశీలించి, ఈ విభాగం గురించి జిల్లా ఎస్పీ వివరిస్తూ, పోలింగ్ లొకేషన్లను లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా రూట్ వారీగా మ్యాపింగ్ చేసి, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది లైవ్ లొకేషన్లను గూగుల్ మ్యాపింగ్ ద్వారా అనుసంధానం చేసి రియల్ టైమ్ మానిటరింగ్ నిర్వహిస్తూ.. కంట్రోల్ రూమ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పరిస్థితులను నిరంతరం కమ్యూనికేషన్ సాధనాలు, వెబ్ క్యాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ, రూట్ మొబైల్ అధికారులు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏ ప్రాంతాల్లో ఎంత దూరంలో ఉన్నారో గుర్తించి, ఎలాంటి సమస్య తలెత్తినా అత్యంత సమీపంలో ఉన్న సంభందిత బలగాలను వెంటనే ఘటన స్థలానికి పంపించే విధంగా సమన్వయం చేస్తోందని తెలిపారు. ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ని మరియు జిల్లా టెక్నికల్ టీంను అభినందించారు.

అనంతరం సంగారెడ్డి పట్టణంలోని కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిందని వివరించారు. అలాగే బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూమ్‌కు సురక్షితంగా చేరే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ తదనంతరం ఎలాంటి అల్లర్లు జరగకుండా మరియు కౌంటింగ్ ప్రక్రియా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎలెక్షన్ సెల్ ఇన్స్పెక్టవర్స్ ప్రవీణ్ రెడ్డి, సదా నాగరాజు, ఎస్ఐలు హిమబిందు, కావేరీ తదితరులు పాల్గొన్నారు.
