
సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురు, ఒక నిందితుడు మరియు వారికి సహకరిస్తున్న ఒక మహిళని అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీస్,జిల్లా SP శరత్ చంద్ర పవార్ IPS,వీరి వద్ద నుండి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి మరియు పల్సర్ NS-200 బైక్ స్వాధీనం ( మొత్తం విలువ 20,00,000/-).
Cr.No.233/2025 U/s 8 (C) 20(b)(ii)(B), 29 of NDPS Act-1985 Amendment Act 2001.
1). మైనర్ బాలుడు, వయస్సు:16సం,, 9th class( discontinued).
2) మైనర్ బాలుడు, వయస్సు:14సం,, 9th class.
3) బాజపల్లి జోసెఫ్ తండ్రి రాజేష్, వయస్సు:20సం., వృత్తి:ఫ్లవర్ డెకరేషన్, r/o రాజీవ్ గాంధీ నగర్, నాగోల్,హైదరాబాద్.
4) ఎరిక్ విల్సన్ మెరీనా తండ్రి వినోద్ విల్సన్, వయస్సు:25 సంవత్సరాలు, వృత్తి:ప్రవేటు జాబ్, r/o తట్టి అన్నారం, నాగోల్, హైదరాబాద్.
5) బోస్, r/o నాగోల్, హైదరాబాద్.(Absconding).
6) మాలిక్, r/o ఒరిస్సా.(Absconding).
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మరియు ఆస్తి సంబందిత నేరాలను అరికట్టుటలో మరియు చేధించుటలో భాగంగా తేదీ: 30.06.2025 నాడు తన ఇంటిలో దొంగతనం జరిగింది అని గాలి యాదయ్య, వృత్తి: రిటైర్డ్ IFS ఆఫీసర్ తన ఇంటిలో 22 తులాల బంగారం, 80 తులాల వెండి దొంగతనం జరిగింది అని ఇచ్చిన దరకస్తూ ప్రకారం నమోదు చేసిన Cr. No:218/2025 కేసు లో నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు C.I, నార్కెట్ పల్లి, ఆద్వర్యం లో S.I నార్కెట్ పల్లి మరియు సిబ్బంది పలు బృంధాలు గా ఏర్పడి గాలిస్తున్న సమయం లో ఉదయం 05:00 గంటలకి నమ్మదగిన సమాచారం మేరకు నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ లో నలుగురు వ్యక్తులు నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు నార్కెట్ పల్లి SI డి. క్రాంతి కుమార్, వారి సిబ్బందితో యుక్తముగా నార్కెట్ పల్లి గ్రామ శివారు లో రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ దగ్గరలో వెళ్ళి అనుమానాస్పదంగా కనిపించిన పైన తెలిపిన నలుగురు వ్యక్తులను అంధులో ఒక ఆడ మనిషి లని పట్టుబడి చేసి వారిని విచారించగా అట్టి నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాయిని తీసుకొని గంజాయి తాగే వారికి నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయిని అమ్మాలని ప్రయత్నిస్తుండగా ఉదయం నార్కెట్పల్లి గ్రామ శివారులో రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ లో నార్కెట్ పల్లి పోలీసు వారు పట్టుబడి చేసి నిందితుల వద్ద నుండి 2 కేజిల గంజాయి, బంగారు గాజులు, బంగారు పుస్తెలతాడు, బంగారు నక్లెస్, సిల్వర్ కుంకుమ బారనిలు, బంగారు చెవి రింగ్స్, బంగారు సదా రింగ్, బంగారు మాటీలు, గోల్డ్ కాయిన్స్, వెండి పట్టాగొలుసులు, వెండి కాయిన్స్, వెండి విగ్రహాలను మొత్తం 17.1 తులాల బంగారం, 79 తులాల వెండి మరియు 1 ద్విచక్ర వాహనన్ని స్వాధీనం చేసుకోనైనది. ఇట్టి నేరంలో వారిపై Cr.No.233/2025 U/s 8 (C) 20(b)(ii)(B), 29 of NDPS Act-1985 Amendment Act 2001 ప్రకారంగా Narketpally PS నందు కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చనైనది. వీరు గంజాయికు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండటంతో జవహర్ నగర్, నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి. అయిన వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాక, చెడు వ్యసనాలకు అలవాటు పడి, సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఒక మైనర్ బాలుడు యొక్క దగ్గరి బందువులు నార్కెట్ పల్లి మండలం లో వుండటం వలన తన కి ఇట్టి ప్రాంతం పై అవగాహన వుండడం వలన నార్కెట్ పల్లి మండలం లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని తాము అనుకున్న పథకం ప్రకారముగా గంజాయి విక్రయించడంతో పాటు రాత్రి సమయంలో తాళం వేసి వున్న ఇండ్లను లక్షంగా చేసుకొని తాళం పగులగొట్టి దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఎరిక్ విల్సన్ మెరీనా అను మహిళ వారికి సహకరిస్తుంది. ఇట్టి నేరస్తులు మారణాయుుదాలని తమ వద్ద వుంచుకొని దొంగతనాలకి పాల్పడుతూ అడ్డు వస్తే చంపడానికి కూడా వెనకాడని గ్యాంగ్. వీరు ఉపయోగించిన మారణాయుుదాలు అయిన కత్తి మరియు బల్లెం కూడా స్వాదినం చేసుకోనైనది.
- నార్కెట్ పల్లి P.S, ఐదు కేసులు నమోదు( 04 house break, 01 NDPS case ).
- జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఒక హౌస్ బ్రేక్ కేసు నమోదు చేయడం జరిగింది.
అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, మరియు ఎవరైనా వినియోగించినా/వాడినా ఉపేక్షించేది లేదు. జిల్లా యస్పి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా S.P హెచ్చరించనైనది. అలాగే జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో దొంగతనాలు నివారణకు పగలు, రాత్రి పటిష్ఠ గస్తీ నిర్వహిస్తూ, పాత నేరస్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లా ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి C.I, K. నాగరాజు ఆద్వర్యంలో నార్కెట్ పల్లి S.I, D. క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది ASI-ఆంజనేయులు, HC రాము, PCs సత్యనారాయన, హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, క్రిష్ణ, మహేశ్, లను జిల్లా S.P అభినందించనైనది.

