బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్
Telangana

రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి

రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి

మహబూబ్‌నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి పిలుపునిచ్చారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. త్వరితగతిన, తక్కువ వ్యయంతో శాశ్వత పరిష్కారం పొందేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ చలానాలు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, రాజీకి అనుకూలమైన ఇతర కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సాధారణ కోర్టు విచారణలతో పోలిస్తే తక్కువ సమయంలోనే వివాదాలను ముగించుకునే వీలుంటుందని, దీనివల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని చెప్పారు.

మహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ

ఇరు పక్షాల అంగీకారంతో శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సామాజిక సామరస్యానికి కూడా దోహదం చేస్తుందని ఎస్పీ వివరించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని సూచించారు.

“రాజీ మార్గమే రాజమార్గం” అనే భావనతో జూన్ 20న నిర్వహించే రెండవ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి. జానకి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.