బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
SANGA REDDY DIST

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.

నో హెల్మెట్.. నో పెట్రోల్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలి.

రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలి.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు తప్పకుండా శిక్ష పడేలా కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అధికారులు అందరూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని,ప్రతి రోజు రౌడి,హిస్టరీ షీటర్స్ ని తనిఖీ చేస్తూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గంజాయి వంటి మత్తు పదార్ధాలు , మట్కా , జూదం , అక్రమ ఇసుక రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్,బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన సేవనంపై కఠినంగా వ్యవహరించాలని,పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు.Arrive alive కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వాహనదారులకు , ప్రజలకు , విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, నో హెల్మెట్ నో పెట్రోల్ పై వాహనదారులకు అవగాహన కల్పించాడంతో పాటుగా పెట్రోల్ బంక్ ల వద్ద నో హెల్మెట్..నో పెట్రోల్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలన్నారు.

ఈసమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి,అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వేంకటేశ్వర్లు, శ్రీనివాస్, డిసిర్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, పిసిఆర్ ఇన్స్పెక్టర్ మధుకర్, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.