బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులు

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులు

నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన విలువలను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివ ప్రసాద్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు.