బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Hyderabad

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 62 గ్రాముల బంగారం చోరీ.. కేసు ఛేదించిన ఖైరతాబాద్ పోలీసులు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 62 గ్రాముల బంగారం చోరీ.. కేసు ఛేదించిన ఖైరతాబాద్ పోలీసులు

హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించబడిన సుమారు 62 గ్రాముల బంగారు ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లాకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో బాధితుడి వద్ద ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఆ బ్యాగ్‌లో సుమారు 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన తాతపూడి తెల్ల రాజా అలియాస్ రాజు (48)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన పూర్తి బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితుడిపై గతంలో కూడా కూకట్‌పల్లి, పేట్ బషీరాబాద్, పంజాగుట్టతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు. అలాగే ఎల్బీనగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరికొన్ని కేసుల్లోనూ తన ప్రమేయం ఉన్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

నకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్

ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. దూర ప్రయాణాల సమయంలో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఎల్లప్పుడూ వ్యక్తిగత భద్రతలో ఉంచుకోవాలని సూచించారు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగులను లాక్ చేసి తమ కంటిచూపు పరిధిలోనే ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనిస్తే వెంటనే బస్సు సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

అదేవిధంగా ట్రావెల్ ఆపరేటర్లు బస్సుల్లో, బోర్డింగ్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రయాణికుల వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడంతో పాటు, డ్రైవర్లు మరియు సిబ్బందిని అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కేసును పంజాగుట్ట డివిజన్ ఇన్‌చార్జ్ ఏసీపీ కె. సంజయ్ కుమార్ పర్యవేక్షణలో, ఖైరతాబాద్ ఎస్‌హెచ్‌ఓ బి. వెంకట్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి నేతృత్వంలోని క్రైమ్ టీమ్ ఛేదించింది. కేసును విజయవంతంగా పరిష్కరించిన పోలీసు బృందాన్ని ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు.