బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన
ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్
ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ యొక్క వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధనలు జరిపి మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో నాగర్ కర్నూల్ జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (డిటిఓ) ఎల్. చిన్న బాలు నాయక్ డాక్టరేట్ పట్టా పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని మారుమూల ప్రాంతమైన యతిరాజతాండకు చెందిన చిన్న బాలు నాయక్ కష్టపడి చదివారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ సరిహద్దులోని యతిరాజా తండాలో చిన్న వ్యవసాయ కుటుంబం ద్వారా నేడు ఆయన ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా పేరు సంపాదించుకున్నారు. రామాపురంలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించిన చిన్న బాలు నాయక్ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లొనీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బీటెక్ కోసం శ్రీనిధి ఇన్స్టిట్యూట్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ప్రొడక్షన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. మొదట తమిళనాడులోనీ మైనింగ్ శాఖలో
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ ఎల్ సి ఎల్), వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా 2012లో ఉద్యొగం సాధించి హైదరాబాద్ కు వచ్చేశారు. చిన్న బాలు నాయక్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు. అక్కడినుండి ఆయన బదిలీపై ప్రమోషన్ పొంది డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (డిటిఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. చదువుపై ఎంతో శ్రద్ధాసక్తి కలిగిన చిన్న బాలునాయక్ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుపై ఆసక్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో మెటల్ మ్యాట్రిక్స్ కోసం మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టా పొందడం విశేషం. డాక్టరేట్ పొందడం పట్ల చిన్న బాలు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే విద్యను నిర్లక్ష్యం చేయకుండా అన్ని పరిస్థితులను తమకు అనువుగా మలుచుకుని
ముందడుగు వేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.