బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Telangana

మహిళల సురక్షిత ప్రయాణానికి ‘షీ-షట్లర్’ బస్సు ప్రారంభం

మహిళల సురక్షిత ప్రయాణానికి ‘షీ-షట్లర్’ బస్సు ప్రారంభం

సంగారెడ్డి: జిల్లాలోని పారిశ్రామిక వాడలలో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి) మరియు న్యూల్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “షీ-షట్లర్” బస్సును జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ప్రజలు, పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్యల నియంత్రణతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టే లక్ష్యంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీసు శాఖ–కంపెనీల అనుసంధానంతో ఈ సంస్థ పనిచేస్తోందన్నారు.

ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ వరకు ఈ బస్సు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తుందని, ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు మరియు పాఠశాల విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బస్సు జీపీఎస్‌కు అనుసంధానమై ఉండటంతో ప్రస్తుత స్థానం, సమయ వివరాలు సులభంగా తెలుసుకునే వీలుందని తెలిపారు.

ఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం

మహిళలు తప్పనిసరిగా “టి-సేఫ్” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ ప్రయాణ వివరాలను అందులో నమోదు చేయాలని సూచించారు. ఆపద సమయంలో డైల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఐలా పాశమైలారం కమిటీ ప్రతినిధులు, న్యూల్యాండ్ కంపెనీ సెక్రటరీ శారద, హెచ్‌ఆర్ ప్రతినిధులు, సి.ఎస్.ఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.