బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Telangana

సైబర్ మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్రపై ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 7 మంది అరెస్ట్

సైబర్ మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్రపై ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 7 మంది అరెస్ట్

సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు, ఐదు వేర్వేరు కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశారు.

సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొంతమంది బ్యాంకు ఉద్యోగులు, క్షేత్రస్థాయి అధికారులు సరైన తనిఖీలు చేయకుండా చట్టవిరుద్ధంగా కరెంట్ ఖాతాలను తెరిచారు. ఇందుకు ప్రతిఫలంగా కమీషన్లు స్వీకరించి, సైబర్ మోసగాళ్లు మరియు ఖాతా సరఫరాదారులతో కుమ్మక్కయ్యారని విచారణలో తేలింది.

ఈ అక్రమంగా తెరిచిన బ్యాంకు ఖాతాలను తర్వాత భారీ స్థాయిలో సైబర్ మోసాలకు వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. కేవైసీ నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలు తెలిసి కూడా కావాలనే విస్మరించి, మోసగాళ్లకు సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

అరెస్టైన వారిలో ఇండియన్ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ అనూష (30), కూకట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ ముడవత్ దినేష్ చౌహాన్ (34), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ మేనేజర్ నదీష్ సాంబార్ (32), బంధన్ బ్యాంక్ మాజీ ఫీల్డ్ ఆఫీసర్ రేణికుంట మహేష్ (37), ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రెడ్డి హరీష్, బ్యాంక్ సేల్స్ మేనేజర్ ఎన్. రవి, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గోనెల సాయి వెంకట్ (29) ఉన్నారు.

శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఈ ఖాతాల ద్వారా సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలకు మించి అధిక విలువ గల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక (AML) మార్గదర్శకాలు, ఫిర్యాదు వ్యవస్థలు, భద్రతా చర్యలను అమలు చేయడంలో నిందితులు విఫలమయ్యారని తెలిపారు.

నిందితుల చర్యలు అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం మాత్రమే కాకుండా వ్యవస్థీకృత సైబర్ నేర ముఠాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టేనని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణంగా అమాయక ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని వెల్లడించారు.

సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న అంతర్గత వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.