బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Telangana

కొత్రేపల్లి ఫైరింగ్ రేంజ్‌లో పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణ: ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలనలో ఫైరింగ్ ప్రాక్టీస్

కొత్రేపల్లి ఫైరింగ్ రేంజ్‌లో పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణ: ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలనలో ఫైరింగ్ ప్రాక్టీస్

కొత్రేపల్లి ఫైరింగ్ రేంజ్‌లో వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు (SHOలు) ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS స్వయంగా హాజరై పరిశీలించారు.

ఫైరింగ్ రేంజ్‌లో అధికారులు నిర్వహిస్తున్న వివిధ రకాల తుపాకుల ఫైరింగ్‌ను ఎస్పీ గారు దగ్గరగా గమనించి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఆయుధాల పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి ఆయుధాల వినియోగంపై పూర్తి ప్రావీణ్యం సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, సీనియర్ అధికారులు మరియు ఎస్‌హెచ్‌ఓలు తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్‌పై పూర్తి అవగాహన కల్పించాలని, ఫైరింగ్ గ్రౌండ్‌లో పాటించాల్సిన నియమాలు, భద్రతా ప్రమాణాలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. ప్రజల భద్రతను కాపాడటంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, అందుకు అవసరమైన శిక్షణను నిరంతరం కొనసాగించడం ముఖ్యమని ఆమె తెలిపారు.

శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్

తుపాకులతో విధులు నిర్వహించే అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు పోలీసుల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడతాయని, తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, డిసిఆర్బి డీఎస్పీ జానయ్య, డిటీసి డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా ఏఆర్ డీఎస్పీ వీరేష్, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.