బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులు
Telangana

వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్” షార్ట్ ఫిల్మ్ పోటీలు: యువతలో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమం

వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్” షార్ట్ ఫిల్మ్ పోటీలు: యువతలో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ‘99 రోజుల క్యాంపెయిన్’ లో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS గారి ఆధ్వర్యంలో “సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్” (Safe Youth, Strong Nation) అనే నినాదంతో జిల్లా స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పోటీల ద్వారా సైబర్ క్రైమ్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, మహిళలు మరియు పిల్లల రక్షణ (గుడ్ టచ్ & బ్యాడ్ టచ్), మాదకద్రవ్యాల అనర్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ATM దొంగతనాలు, జాబ్ ఫ్రాడ్ మరియు గిఫ్ట్ ఫ్రాడ్ నివారణ, న్యాయ విజ్ఞానం అలాగే ఆత్మహత్యల నివారణ వంటి ముఖ్య సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పోటీలు 27-04-2026 నుండి ప్రారంభమై 02-05-2026 వరకు కొనసాగుతాయి. పాల్గొనే వారు 2 నుండి 3 నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిల్మ్ రూపొందించాల్సి ఉంటుంది. జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రియేటివ్ ఆర్టిస్టులు, కంటెంట్ క్రియేటర్లు మరియు యూట్యూబర్లు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.

సమర్పించే వీడియోలు కేవలం వినోదం కోసం కాకుండా, సమాజంలో బాధ్యతను పెంచే సందేశాత్మకంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. సమర్పించిన చిత్రాల నుంచి కమిటీ టాప్ 5 ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్‌ను ఎంపిక చేస్తుంది. ఎంపికైన విజేతలకు జిల్లా పోలీస్ శాఖ ద్వారా నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందించబడతాయి. అలాగే వాటి పబ్లిక్ స్క్రీనింగ్ కూడా నిర్వహించబడుతుంది.

గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష

పాల్గొనదలిచిన వారు తమ పేరు, ఫోన్ నంబర్ మరియు వీడియో టైటిల్‌తో కలిసి వాట్సాప్ ద్వారా 9948542227 నంబర్‌కు పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం SB ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ గారిని 8712670020 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, కెమెరా ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఇది గొప్ప వేదిక అని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరుతోందని తెలిపారు.