ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి. నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ, ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు. అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు.’ అని అన్నా హజారే విరమ్శించారు.
