టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల నుంచి దిగుమతులు చేయడం తగ్గుతుందని తెలిపింది. ఇది మేకిన్ ఇండియా దోహదం చేస్తుందని వివరించింది.
