Breaking News

హైదరాబాద్‌లో భారీ ‘డిజిటల్ అరెస్ట్’ ముఠా గుట్టురట్టు: ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.07 కోట్ల భారీ సైబర్ మోసానికి పాల్పడిన కేసులో ఢిల్లీకి చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల బాధితుడికి అక్టోబర్ 16, 2025న ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని, బాధితుడి ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్ అక్రమ కార్యకలాపాల్లో వినియోగించబడ్డాయని నిందితులు భయపెట్టారు. మనీ లాండరింగ్ విచారణ పేరుతో బాధితుడిని మానసిక ఒత్తిడికి గురిచేసి, అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 1,07,00,000 (కోటి ఏడు లక్షలు) వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు.

సీబీఐ, కస్టమ్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని పరిచయం చేసుకుంటారు.బాధితుడు డ్రగ్స్ లేదా టెర్రరిజం కేసుల్లో చిక్కుకున్నారని నమ్మిస్తారు. వారంటు ఉందంటూ వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి గంటగంటకూ నివేదించాలని ఆదేశిస్తారు అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఆస్తులను నగదుగా మార్చి సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పి తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు.
నిందితులు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో బస చేస్తూ, కమీషన్ ఆశ చూపి ఇతరుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తారు. బాధితుల నుండి వచ్చే డబ్బును వెంటనే ప్రధాన సూత్రధారికి బదిలీ చేస్తారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో అనేక బ్యాంకు ఖాతాల వివరాలు లభ్యమయ్యాయి. వీరికి గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..

పోలీసులు, సీబీఐ లేదా కోర్టు అధికారులు ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరు. కేసుల నుండి విముక్తి కలిగిస్తామని ఏ ప్రభుత్వ సంస్థ డబ్బు డిమాండ్ చేయదు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలను అపరిచితులకు షేర్ చేయవద్దు. మీ బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడకానికి ఇస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

డి. జోయల్ డేవిస్ పర్యవేక్షణలో, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్ కె. ప్రసాదరావు మరియు వారి బృందం ఈ కేసును ఛేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *