జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పోలీస్ వాహనాల ఉపయోగించి వదిలేయబడిన (కాలం చెల్లిన) వివిధ రకాల పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం తేది 11-02-2025 మంగళ వారం రోజున ఉదయం 10.00 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలం నిర్వహించడం జరుగుతుందని, ఈ వేలంలో పోలీస్ వాహనాలకు సంబంధించిన వివిధ రకాల పాత టైర్లు, ఆయిల్, స్పేర్ పార్ట్స్ తదితర విడి విభాగాలు వేలం వేయనున్నారని వేలంలో పాల్గొనేవారు మంగళ వారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనగలరని అన్నారు.
పూర్తి వివరాల కొరకు మోటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూరప్ప నాయుడు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8712670170
