Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకై RRR కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మతులు.

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు RRR కార్యక్రమం ప్రారంభించి జాతీయ,రాష్ట్రీయ రహదారుల మరియు R&B పంచాయతి రాజ్ రోడ్డు గ్రామాల మధ్య నుంచి వెళ్లే 109 గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల ప్రజలు, వాహనదారులు రోడ్డు దాటుతున్న క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల నివారణకు RRR నూతన కార్యక్రమం ద్వారా సంబంధిత పోలీస్ అధికారులు,రోడ్డు సేఫ్టీ వింగ్ మరియు పోలీస్ కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 41 బ్లాక్ స్పాట్ గుర్తించి ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా గతంలో నల్లగొండ నుంచి చౌటుప్పల్ వెళ్లే MDR రోడ్డు కాంచనపల్లి గ్రామ శివారులో ఉన్న AMR ప్రాజక్ట్ కాలువ బ్రిడ్జి పై ఇరువైపులా సేఫ్టీ గోడ లేనందున తరుచూ అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని జిల్లా ఎస్పి గుర్తించి సంబంధిత అధికారులుతో ప్రమాదాల నివారణకు ఇరువైపుల గోడ నిర్మించటం జరిగింది.
అలాగే మునుగోడు నుంచి నార్కట్పల్లి ఆర్& బి రోడ్డులో గల సింగారం గ్రామ శివారులో ఉన్న మూల మలుపు వద్ద బావిలో వాహనాలు పడి ప్రమాదాలు జరుతుండగా ఆ ప్రదేశాన్ని గుర్తించి సంబంధిత అధికారులతో బావిని పూడిపించి ప్రమాదాలు జరగకుండా నివారణా చర్యలు తీసుకోవడం జరిగింది.


అలాగే మాల్ నుంచి మల్లేపల్లి రాష్ట్రీయ రహదారి పై తొమ్మిది మూలమలుపుల వద్ద కంపచెట్ల ఉండడం వాహనదారులకు వల్ల కనిపించకపోవడం కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా ఆ ప్రదేశాన్ని గుర్తించి సంబంధిత అధికారులతో తొలగించడం జరిగింది. అలాగే మల్లపల్లి నుంచి కొండబీమన పల్లి ఉన్న జాతీయ రహదారి పై మూల మలుపుల వద్ద ఉన్న కంపచెట్లు తొలగించి, వేగా నియంత్రణ చర్యలు, చూచిక పలకలు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఇంకా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఈ సందర్భంగా తెలిపారు.

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *