కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9 ఓవరాల్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లతో పాటు 67 బంగారు, 32 రజత, 23 కాంస్య పతకాలను సాధించారు.
ఈ రోజు హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్, పతక విజేతలను అభినందించారు, కమీషనర్ ఒక క్రీడాకారుడు కావున తీవ్రమైన పోలీసు విధులను సాగిస్తూ క్రీడలలో రాణించడానికి అవసరమైన అంకితభావం మరియు కఠినమైన శిక్షణను గుర్తించారు. ముఖ్యంగా ఫైనల్స్‌లో ప్రదర్శించేందుకు ఎలాంటి ఒత్తిడిలోనైనా అవసరమైన మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని తెలిపారు.
సి.పి ఆనంద్ తన పాఠశాల మరియు కళాశాల సంవత్సరాలలో అథ్లెట్‌గా తన స్వంత అనుభవాలను ప్రతిబింబిస్తూ, క్రీడలు క్రమశిక్షణ, జట్టు కృషిని మరియు జీవితంలోని సవాళ్లను నావిగేట్ చేసే సామర్థ్యాన్ని ఎలా పెంపొందిస్తాయి తెలియజేశారు. బలమైన క్రీడా మనస్తత్వం కలిగిన శారీరక దృఢత్వం కలిగిన సిబ్బంది పోలీసు సేవల డిమాండ్లనూ నిర్వహించడానికి మెరుగైన సన్నద్ధత కలిగి ఉంటారని కమిషనర్ పునరుద్ఘాటించారు.

రాబోయే ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారికి పూర్తి పరిపాలనా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమములో N.భాస్కర్, Addl.DCP(అడ్మిన్); బి.కిష్టయ్య, అదనపు డిసిపి, శ్రీ.కిషన్ రావు, ఎసిపి (సిఎఆర్ స్పోర్ట్స్ ఆఫీసర్) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
