కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్.
ఢిల్లీ : సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్ వారికి నిర్వహించే ఆల్ ఇండియా బోర్డు పరీక్షలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈద శివకుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇందుకు గాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలోని CFPB జనవరి 30- 31వ తేదీల్లో నిర్వహించిన 25వ అఖిల భారత ఫింగర్ ప్రింట్ బ్యూరో నిర్దేశకుల సమావేశం సందర్భంగా ప్రతిష్టాత్మక ఖాన్ బహదూర్ Azizul Haque ట్రోఫీనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న నిత్యానంద రాయ్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
తెలంగాణ : ఆల్ ఇండియా బోర్డు పరీక్షలో మొదటి స్థానంలో నిలిచినందుకు నేర పరిశోధన విభాగ డీజీపీ శిఖా గోయల్, రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ M.D.తాతా రావు మరియు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సబ్ ఇన్స్పెక్టర్ ను అభినందించారు.

