బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణ
Telangana

సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులకు విశేష విజయం – రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు యజమానులకు అందజేత

సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులకు విశేష విజయం – రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు యజమానులకు అందజేత

జిల్లా పోలీస్ యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీలో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. సుమారు రూ.6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో, గత కొన్ని రోజులుగా పోయిన లేదా చోరీకి గురైన ఫోన్లను మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సాంకేతిక ఆధారాలతో ట్రేస్ చేసి రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా బాధితులకు ఫోన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారానికి కేంద్రంగా మారిందన్నారు. బ్యాంక్ ఖాతాలు, పాస్‌వర్డ్లు వంటి కీలక సమాచారం ఫోన్లలో భద్రపరుస్తున్న నేపథ్యంలో నేరగాళ్లు వీక్ పాస్‌వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ చెల్లింపు మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే Central Equipment Identity Register (CEIR) పోర్టల్ www.ceir.gov.in లో బ్లాక్ చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా షాప్ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగిలించబడిన ఫోన్లను తక్కువ ధరకు అమ్ముతున్న సందర్భాల్లో అమాయకులు మోసపోతున్నారని, దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

CEIR అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్‌లను ఎస్పీ అభినందించారు.

తమకు తిరిగి ఫోన్లు అందడంతో బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, ఆర్‌ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.