బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

వికారాబాద్, ఆగస్టు 3: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల నుంచి వచ్చిన 58 మంది బాధితులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి బాధితుడి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా, నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసం, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డేను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రజా సమస్యలకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.