Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం:బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్

పాలకుర్తి, జనవరి 6 ది పోలీస్ డైరీ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని అందుకు నిదర్శనమే ఎన్నికలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఎకరాకు 12000 అంటూ బూటకపు మాటలను వల్లే వేస్తుందని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ ఎద్దేవ చేశారు.
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ ఏరు దాటకముందు ఏటి మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని, 15000 రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చినంక విస్మరించి రైతులను నమ్మించి నట్టేట ముంచిందని దయ్యం పట్టారు.
రైతుల కోసం కెసిఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే వాటన్నిటిని విస్మరించి రైతుల ఉసురుపోసుకుంటుందని విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి,
కారు పోతుల వేణు గౌడ్.
మాజీ పాలకుర్తి ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ దారావత్ యాకూబ్ నాయక్, భారత రాష్ట్ర సమితి ఎస్టి సెల్ మండల అధ్యక్షులు దారా శంకరయ్య, మాజీ వైస్ ఎంపీపీ పుస్కూరి కళింగరావు చెన్నూరు మాజీ ఎంపీటీసీ మాటూరి యాకయ్య, కత్తి సైదులు, గడ్డం కిరణ్, ఎండి నాజర్, జలగం అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *