*గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..!
పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..!
ఓ వందన..ఇంకో సరోజిని..మరో కృష్ణవేణి..
ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..?
వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..!
గ్యాంగ్ అంతటికీ లీడర్ అమూల్య.ఓ స్టేట్‌లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్‌లో విక్రయించడం అమూల్య బిజినెస్.
పేరుకు ఆశా వర్కర్ చేసేది మాత్రం పిల్లలను అమ్మే బిజినెస్.
ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్‌వర్క్‌ను అంతకంతకు విస్తరించింది. ఆ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది దొంగ ముఠా.
తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది.
మొత్తం పదిమంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు.కాపాడిన వారిలో ఆరుగురు ఆడ, నలుగురు మగ శిశువులు ఉన్నారు.
గుజరాత్, మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు.
చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు.
మధురానగర్లోని శిశు విహార్ కు తరలించారు.
ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధురానగర్లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులను ఉంచనున్నారు.
వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, వారి బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.
దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు.
తొమ్మిది మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయని…
16 మందిని రెస్క్యూ చేయగా ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు.