కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
రానున్న ఉగాది,రంజాన్ పండుగ సందర్భంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వారిపై నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తూన్నమని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరైన సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్,ఫేస్బుక్,ట్విట్టర్, ఇన్స్టాగ్రం, యూ ట్యూబ్,మొదలగు వాటిని వేదికగా చేసుకుని ఇతర కులాల పట్ల ,మతాల పట్ల,వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు,విద్వేష పూరితమైన పొస్ట్ లు,ద్వేష పూరిత ప్రసంగాలు, రెచ్చ గొట్టే విధంగా పోస్ట్ లు,అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో తప్పుడు పోస్టులు పెడితే తగిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమా లను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కి తెలియజేయాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.