Breaking News

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..


మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లు
ఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం
QR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చు

మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా ఐపీఎస్ సుధీర్ రాం నాథ్ కేకన్ తెలిపారు

కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టు వెస్తునాయని ఆయన అన్నారు.

  • రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల , దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారు.

మహబూబాబాద్,తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ముఖ్య కుడలులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.

  • ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లపుడు అండగా నిలుస్తూ దైర్యన్ని ఇస్తాయన్నరు.

అవగాహన కార్యక్ర మాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి అన్నారు.

తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

ఆకతాయిలు వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100, 112,తో పాటు 8712656935వాట్సప్ నంబర్ లో సంప్రదించాలని , ఉన్నచోట నుండి ఫిర్యాదు చేయడానికి qr.tspolice.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

బస్టాండ్, పాఠశాలలు. కళాశాలలు వద్ద మహిళ లను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం

జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల వద్ద షీ-టీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *