Breaking News

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి.—

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి.

కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. జాగ్రత్త

ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక ఫక్తు వ్యాపారం.

చిన్న చిన్న చేపలను అమాంతం మింగేస్తాయి జాగ్రత్త…

పెద్దలకు సూచన: ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి.

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది.

మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండి.

IPL క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా IPL క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా IPL క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *