Breaking News

జిఎస్టి కట్టకుండ సాగర్, రాశి, నాగార్జున సిమెంట్ పేరు మీద నకిలీ బస్తాలు తయారు.

లారీ బంకర్లలో లూజ్ సిమెంటును అక్రమ రవాణా చేస్తూ ఏటువంటి అనుమతులు లేకుండా వివిధ కంపెనీలకు చెందిన పేర్లతో బస్థాల్లో నింపి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన జిల్లా పోలీస్. కె.శివరాం రెడ్డి నల్గొండ డీఎస్పీ.
సుమారు 4 లక్షల విలువ గల 1500 సిమెంట్ బస్తాలు (ఒక్కొక్కటి 50 కేజిల బరువు) మరియు ఒక బంకర్ (లారీ) స్వాధీనం.
లారీ బంకర్లలో లూజ్ సిమెంటును అక్రమ రవాణా చేస్తూ ఏటువంటి అనుమతులు లేకుండా వివిధ కంపెనీలకు చెందిన పేర్లతో బస్థాల్లో నింపి అక్రమంగా విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ SP శరత్ చంద్ర పవర్ ఐపిఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ మరియు చిట్యాల పోలీస్ సంయుక్తంగా వీరిని పట్టుకొని విచారించగా, వీరు సుమారు 30 బంకర్ (లారీ) లు సాగర్, రాశి, నాగార్జున సిమెంట్ కంపెనీ ల నుండి సిమెంట్ ను మోతాదుకు మించి లోడ్ చేసుకొని అందులో నుంచి కొంత మొత్తం, ఫుల్ లోడ్ లోని కొంత భాగం ను తీసి వేరే తెలిసిన వ్యక్తులకు అమ్మగా కొనుగోలు చేసిన వారు తిరిగి పై కంపెనీ ల పేరు మీద నకిలీ బస్తాలు తయారు చేసి లూజ్ సిమెంట్ ను అందులో నింపి ప్రజలకు అధిక ధరకు ఆమ్ముచూ అటు ప్రజలను మరియు ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. 1.గుండాల నవీన్ తండ్రి శ్రీను, నివాసం చిట్యాల గ్రామం, 2.గుండాల దుర్గయ్య తండ్రి సోమయ్య, నివాసం చిట్యాల గ్రామం, 3.గుండాల శ్రీను తండ్రి సోమయ్య, నివాసం చిట్యాల, 4.ఆవినేని రమణయ్య తండ్రి రామయ్య, నివాసం చిట్యాల ( పరారీలో ఉన్నాడు), 5.పెరిక జయ నరసింహ తండ్రి నాగేశ్వర్ రావు, నివాసం ఆగ్రాహరం, జగ్గయ్యపేట, NTR కృష్ణ జిల్లా,AP (బంకర్ డ్రైవర్), 6.మిగిలిన వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి..
  1. లింగుస్వామి పరారీలో ఉన్నారు.
  2. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు సిమెంట్ బంకర్ (లారీ) ల మీద డ్రైవర్లు గా పని చేస్తూ వారు పని చేసే సిమెంట్ కంపెనీలు అయిన సాగర్, రాశి, నాగార్జున సిమెంట్ ను తమ బంకర్లలో వెయింగ్ మెషిన్ దగ్గర పని చేసే వ్యక్తులతో కుమ్మక్కై మోతాదు కు మించి (అనగా 35 టన్నుల స్థానం లో 37-38 టన్నుల సిమెంట్) నింపుకొని డెలివేరి చేయాలిసిన ప్రదేశం లో 35 టన్నులు డెలివేరి చేసి మిగిలిన 2-3 టన్నుల లూజ్ సిమెంట్ ను చిట్యాల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు ఆమ్ముచూ బస్తా కు 100 రూపాయల చొప్పున అక్రమంగా లాభం పొందుతున్నారు. ఫుల్ టాంక్ నుండి కూడా సిమెంట్ ను తీస్తూ అమ్ముతున్నారు. ఇట్టి లూజ్ సిమెంట్ ను కొనుగులు చేసిన పై వ్యక్తులు సాగర్, రాశి, నాగార్జున సిమెంట్ పేరు మీద నకిలీ బస్తాలు తయారు చేసి అందులో లూజ్ సిమెంట్ నింపి బస్తా 250 రూపాయలకు ఆమ్ముచూ అక్రమ లాభార్జన పొందుచున్నారు. ఇలా పై వ్యక్తులు అందరు కుమ్మక్కై ట్రేడ్ లైసెన్సు లేకపోయినా, సంబందిత అధికారుల నుండి అనుమతి లేకపోయినా మరియు జిఎస్టి కట్టకుండ సాగర్, రాశి, నాగార్జున సిమెంట్ పేరు మీద నకిలీ బస్తాలు తయారు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ అటు ప్రజలను మరియు ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కావున వీరిపై (05) కేసులు నమోదు చేసి చిట్యాలకు చెందిన పై 4 గురు నేరస్తులను అరెస్టు చేయడమైనది. అదే విదముగా వీరికి అక్రమముగా సిమెంట్ రవాణా చేస్తున్న 30 సిమెంట్ బంకర్ (లారీ) లను మరియు వారి డ్రైవర్లను గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకోబడును.
  3. ఈ కేసును చాకచక్యంగా పట్టుబడి చేసిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ CI, రమేష్ బాబు, నార్కెట్ పల్లి CI, K.నాగరాజు మరియు చిట్యాల SI, ధర్మ, టాస్క్ ఫోర్స్ SI లు శివప్రసాద్, మహేందర్ మరియు వారి సిబ్బందిని నల్గొండ ఎస్పి అబినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *