
•అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్ ను సంప్రదించండి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.,గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పుల్కల్ మండలంలోని పుల్కల్, పోచారం గ్రామాలలో చెరువు కట్టలు ప్రమాద అంచున ఉన్నట్టు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. పుల్కల్, పోచారం గ్రామ చెరువులను ప్రత్యేకంగా సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎస్పీ. వరద ప్రవాహం పెరిగి, ఆనకట్టలు ప్రమాద స్థాయికి చేరకముందే, ముందస్తు చర్యలు వేగవంతం చేయవలసిందిగా సంభందిత ఇరిగేషన్ అధికారులకు సూచించడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాలు చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, పొంగిపొర్లుతున్న వాగులు వంకలను దాటడానికి ప్రయత్నించకూడదన్నారు. జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. పురాతన ఇండ్లలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా సూచించారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. ఈ విస్టింగ్ నందు ఎస్పీ వెంబడి సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్, జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పుల్కల్ ఎస్సై విశ్వజన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
