
ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ, పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని/ ఆధునిక సాంకేతికతను అందించుకోవాలని సూచించారు. ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నేరాల నివారణకు, జరిగిన నేరాలను చేధించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ. సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ విజిటింగ్ లో స్టేషన్ ఇంచార్జ్ సత్యనారాయణ ఎ.ఎస్ఐ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
