
నార్కట్ పల్లి మహాత్మా జ్యోతిబాపూలే జూనియర్ కళాశాల బి.సి గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.,పాఠశాలలో తరగతి గదిలో విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడి పాఠశాలలోని వసతులు, సమస్యలు అడిగి తెలుకున్న ఎస్పీ. విద్యార్ధులకు భవిష్యత్ పై దిశ నిర్దేశం బోధన చేసిన జిల్లా ఎస్పీ. విద్యార్ధులు,విద్యార్ధి దశ నుండే ఒక లక్ష్యాన్ని పెట్టుకోనీ,ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలి. జీవితంలో ఉన్నత స్థానాలను ఎదగాలంటే విద్యార్ధి దశ కీలకం. విద్యను ఒక ప్రణాళిక బద్దంగా చదవడం ప్రారంభిస్తే ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. విద్యార్ధి దశలో చెడు అలవాట్ల కు బానిసై జీవితాలను ఆగం చేసుకోకూడదు. మొబైల్ ఫోన్లు పక్కకు పెట్టీ చదువు మీద ఆసక్తి చూపాలి. విద్యార్ధి దశలో కష్ట పడి చదివి ఉద్యోగాలు సాధిస్తే సమాజంలో గౌరవం లభిస్తుంది. చదువుతో పాటు ఆటలు,యోగా లాంటి అలవాటు చేసుకొవడం వల్ల శారీరక,మానసిక ప్రశాంతత కలుగుతుంది వాటిని నిత్య జీవితంలో ఒక బాగంగా అలవాటు చేసుకోవాలి.
