
మునిపల్లి పోలీసు స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ, లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని/ ఆధునిక సాంకేతికతను అందించుకోవాలని సూచించారు. ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు.
సిబ్బంది అధికారులు పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, 24*7 అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నేరాల నివారణకు, జరిగిన నేరాలను చేధించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రమాద అంచున ఉన్న చెరువులు, కుంటల వద్దకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని యస్.హెచ్.ఒ కు సూచనలు చేశారు. ఈ సందర్శనలో స్టేషన్ ఇంచార్జి బక్కన్న ఎ.ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు
