బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులు
Telangana

దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేవరకొండ, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఇతర దర్యాప్తు సంబంధిత పత్రాలను సవివరంగా పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం హత్యలు, దోపిడీలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించడంతో పాటు, ప్రతి కేసులో పటిష్టమైన ఆధారాలు సేకరించి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు డిస్పోజల్ కేసుల ఫాలోఅప్, వారెంట్ల అమలు వంటి అంశాలపై కూడా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎస్పీ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డితో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.