బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులు
Telangana

కాచిగూడ పోలీస్ స్టేషన్ బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషదాంతం

కాచిగూడ పోలీస్ స్టేషన్ బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషదాంతం

ప్రకాశం జిల్లాలో బావిలో లభ్యమైన మృతదేహం అంకం రాహుల్‌దేనని అనుమానం – డీఎన్‌ఏ పరీక్షతో నిర్ధారణ

హైదరాబాద్, జూన్ 8: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ అనే విద్యార్థి మృతదేహం ప్రకాశం జిల్లాలోని ఓ బావిలో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మృతదేహం రాహుల్‌దేనని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్ తన కుమారుడు అంకం రాహుల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 287/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాహుల్ సైదాబాద్‌లోని లక్ష్మికళ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ విద్యను అభ్యసిస్తున్నాడు.

గత నెల 27, 2026న రాహుల్ తన స్నేహితుడి మోటార్‌సైకిల్‌పై కాచిగూడ టూరిస్ట్ జంక్షన్‌కు చేరుకున్నాడు. అక్కడ బైక్ దిగి, తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న కాచిగూడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో జూన్ 7 రాత్రి కీలక సమాచారం లభించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో మే 30న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు, ఆ ఘటనపై అక్కడ కేసు నమోదైందని తెలిసింది.

గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష

సింగరాయకొండ పోలీసులు మృతదేహం వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఇతర ఆధారాలను పరిశీలించగా అవి అదృశ్యమైన విద్యార్థి అంకం రాహుల్ వివరాలకు సరిపోలినట్లు గుర్తించారు. అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ విషాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై కాచిగూడ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

– ఎస్‌హెచ్‌ఓ, కాచిగూడ పోలీస్ స్టేషన్